|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:27 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో భగవంతుడిని అడ్డు పెట్టుకుని చేసిన భారీ కుట్ర బయటపడిందని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని, ప్రతిపక్షం మీద బురద జల్లాలని చేసిన కుట్రను ల్యాబ్ రిపోర్ట్‌లు భగ్నం చేశాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అబద్దాల పునాదుల మీద అసత్యాలు పోగుచేసి జగన్ మీద, వైయస్ఆర్‌సీపీమీద బురద జల్లాలని చేసిన కుట్ర పటాపంచలైందన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థల నివేదికల ద్వారా ఈ కుట్రలు భగ్నమై నిజం బయటికి వచ్చిందన్నారు. దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే వృథా ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు.
Latest News