|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:29 PM
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతోనే శ్రీశైలం ఆలయ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ కూల్చివేసే దుస్సాహసం చేశారని, తక్షణం కూల్చిన చోటే ప్రహరీని నిర్మించాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రహరీని నిర్మించకపోతే బ్రాహ్మణులతో కలిసి వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. గీతం కాలేజీకి రూ. 5 వేల కోట్ల విలువైన భూములు అప్పనంగా ఇచ్చేసిన ప్రభుత్వానికి నిత్యం దేవుడికి సేవ చేసే బ్రాహ్మణ సత్రం కూల్చివేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకుంటూ ఇలా ఆలయాల వేదికగా దారుణాలు చేస్తూ పోతే హిందూ సమాజం చీదరించుకుంటుందని మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారమంతా అబద్ధమని సీబీఐ సిట్ చార్జిషీట్ తో తేలిపోయిందని, హిందువుల మనోభావాలను గాయపరిచినందుకు వారిద్దరూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Latest News