|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:30 PM
కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, అవినీతి అక్రమాలు విపరీతంగా పెరిగి ప్రజలు భరించలేని పరిస్థితి నెలకొందని డా. కాకాణి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తానే చంద్రబాబును కోరిన మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపివేయడానికి చంద్రబాబు సమ్మతించాడని ప్రకటించారని గుర్తు చేశారు. శ్రీశైలం దిగువ నుంచి తెలంగాణ రాష్ట్రం రోజుకు 8 టీఎంసీల నీటిని తరలిస్తుంటే, మన రాష్ట్రం కనీసం 3 టీఎంసీల నీరు కూడా తెచ్చుకోలేని దుస్థితి నెలకొందన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని చంద్రబాబు అర్ధాంతరంగా ఆపివేసి రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు.
Latest News