|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:30 PM
కూటమి ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసి వేలాది నేతన్న కుటుంబాలను నాశనం చేసే దిశగా పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ, చేనేత-మరమగ్గాల నేతన్నలతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చేనేతల పోరు” కార్యక్రమం మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిగా చేనేత కార్మికులు పాల్గొని కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “వైయస్ఆర్ నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్న కుటుంబానికి సంవత్సరానికి రూ.24,000 ఆర్థిక భరోసా కల్పించారని గుర్తు చేశారు. ఆప్కోకు ఉన్న రూ.108 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించి చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారేనని అన్నారు. అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి నేతన్నకు నూతన పెన్షన్ అమలు చేసి వారికి సామాజిక భద్రత కల్పించారని పేర్కొన్నారు.
Latest News