|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:31 PM
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించడంతో నిజం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి తన భక్తిని చాటుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిందని, ఇకనైనా ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలని ఆమె డిమాండ్ చేశారు.
Latest News