|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 12:32 PM
తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి నిరసనగా వైయస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణం సిద్ధపటం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో ఆలయంలో 101 టెంకాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని, కోట్లాది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం అత్యంత అనుచితమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడినే, దేవాలయాన్నే అపఖ్యాతికి గురిచేసే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో కల్తీ జరిగిందంటూ చేసిన ప్రచారాలు పూర్తిగా అబద్ధమని తేలిన నేపథ్యంలో, కూటమి నేతలు భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విష ప్రచారాలు ఇకపై పునరావృతం కాకుండా సత్యమార్గంలో నడవాలని కోరుతూ భగవంతునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో భాగస్వాములయ్యారు. తిరుమల దేవస్థాన పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి బాధ్యత అని వైయస్ఆర్‌సీపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Latest News