|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:10 PM
ఆస్ట్రేలియాలో విద్యార్థి వీసాపై నివసిస్తున్న 28 ఏళ్ల భారతీయ యువకుడు ప్రదీప్.. లాయర్‌గా నమ్మించి ఒక వ్యక్తిని రూ.1.28 కోట్ల మేర మోసం చేశాడు. సిడ్నీలోని ప్రముఖ న్యాయసంస్థ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేసి, న్యాయసేవల పేరుతో డబ్బు గుంజాడు. బాధితుడు అనుమానంతో మరో న్యాయవాదిని సంప్రదించడంతో మోసం బయటపడింది. పోలీసులు ప్రదీప్‌ను అరెస్టు చేయగా, మోసగించిన సొమ్ములో ఎక్కువ భాగం బంగారం కొనుగోలుకు ఉపయోగించినట్లు గుర్తించారు. లివర్‌పూల్ న్యాయస్థానం అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
Latest News