|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:11 PM
ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చోవడం, మీటింగ్‌లు, ట్రాఫిక్ జామ్‌ల వల్ల మూత్రాన్ని ఆపుకోవడం సాధారణమైంది. అయితే, ఇది మూత్రాశయం, మూత్ర ఆరోగ్యానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుందని యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మూత్రాన్ని పదే పదే ఆపుకోవడం వల్ల మూత్రాశయం సాగే గుణం తగ్గి, ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ప్రతి 3-4 గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేయాలని, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయాలని సూచించారు.
Latest News