|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:29 PM
ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర చేస్తున్నారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను శనివారం దర్యాప్తు సంస్థలు అప్రమత్తం చేశాయి. దాడుల కోసం పెద్ద ఎత్తున విదేశీ ఆయుధాలను కొనుగోలు చేసినట్లు సమాచారం అందినట్లు తెలిపారు. భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఉన్న ఓ ప్రఖ్యాత కాఫీ చైన్ లలో ఉగ్రదాడులకు నిందితులు ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. వీటి కొనుగోళ్లకు పుల్వామా దాడి కుట్రదారుడు ఉమర్ ఫరూఖ్ భార్య అఫ్రా బీబీ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హర్యాణాల్లోని ముఖ్య నగరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్ చేశారన్నారు. దీంతో ఈ అటాక్‌లకు ప్లాన్ చేస్తున్న వారిపై, వారితో సంబంధమున్న మరికొందరు అనుమానితుల పైనా నిఘా పెట్టామన్నారు.
Latest News