జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:31 PM

లైంగిక నేరాలకు పాల్పడి జైలులో మరణించిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసు దర్యాప్తులో మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విడుదలైన దర్యాప్తు ఫైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే, ఈ ఫైల్స్‌లో పేర్లు ఉన్నంత మాత్రాన వీరిపై ఎలాంటి నేరారోపణలు మోపలేదని అధికారులు స్పష్టం చేశారు.ఈ ఫైల్స్‌లో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన పలు లైంగిక ఆరోపణలతో కూడిన ఎఫ్‌బీఐ జాబితా ఒకటి ఉంది. వీటిలో చాలా వరకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ధ్రువీకరించని సమాచారమేనని తేలింది. దీనిపై అమెరికా న్యాయశాఖ స్పందిస్తూ.. "2020 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ట్రంప్‌పై వచ్చిన ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి" అని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM