చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు.. గుంటూరులో హై టెన్షన్
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:30 PM

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతల ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తలు, తెలుగు మహిళలు యత్నించటంతో గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి్ వివరాల్లోకి వెళ్తే.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై వైసీపీ పాప ప్రక్షాళన పేరుతో పూజల కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరంట్లకు బయల్దేరారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎదురెదురు పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో సహనం కోల్పోయిన అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.


రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్


మరోవైపు చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథి, సీనియర్ లీడర్ వర్ల రామయ్య స్పందించారు. చంద్రబాబును, ఆయన తండ్రిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న మంత్రి.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


 మరోవైపు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు చరిత్రేంటో ప్రజలకు తెలుసన్న వర్ల రామయ్య.. అంబటి రాంబాబు అసభ్య వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు ఔన్నత్యాన్ని ఏమాత్రం తగ్గించలేవని అన్నారు. అంబటికి సభ్యత, సంస్కారాలు లేవని ఆయన మాటలతోనే అర్థమైందన్నారు.


మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబును తాను బూతులు తిట్టలేదని.. తన కారుపై దాడి చేసి.. తనను తిడుతున్న టీడీపీ వాళ్లను తిట్టినట్లు అంబటి రాంబాబు అన్నారు. అయితే మధ్యలో చంద్రబాబు పేరు వచ్చిందన్నారు. తనను తిడుతున్నారనే ఆవేశంలో అలా మాట్లాడానన్న అంబటి రాంబాబు.. ఈ వయసులో, ఈ హోదాలో అలా మాట్లాడి ఉండాల్సింది కాదని చెప్పుకొచ్చారు. తనను అరెస్ట్ చేయాలని చంద్రబాబు నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని.. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుకు, నారా లోకేష్‍కు, రెడ్ బుక్‌కు తన కుక్క కూడా భయపడదంటూ అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM