|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 08:49 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ సంజూ నిరాశపరిచాడు. హోమ్ గ్రౌండ్‌లో, సొంత అభిమానుల మధ్య చెలరేగుతాడని అందరూ ఆశించినప్పటికీ.. మరోసారి అదే తప్పిదంతో వెనుదిరిగాడు.న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లో సంజూ శాంసన్ కేవలం 6 బంతుల్లో ఒక ఫోర్‌తో 6 పరుగులే చేశాడు. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.ఈ మ్యాచ్‌లోనూ సంజూ తన పాత తప్పిదాన్ని పునరావృతం చేశాడు. ఫుట్‌వర్క్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా షాట్ ఆడి మరోసారి మూల్యం చెల్లించుకున్నాడు. ఎదుర్కొన్న ఆరు బంతులన్నింటినీ బ్యాక్‌ఫుట్‌లోనే ఆడడం విమర్శలకు దారితీసింది. మ్యాచ్‌కు ముందు ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించినా, సంజూ వాటిని పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.సంజూ శాంసన్ వైఫల్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “లూజ్ మోషన్స్ ఏమైనా అయ్యాయా?”, “ఆత్రం ఆగకుండా ఔటై వచ్చావు” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. “కుక్క తోక వంకరే”, “సంజూ ఇక మారడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్విటర్‌కు ఎక్కువ, టీమిండియాకు తక్కువ అంటూ జట్టులో అతని స్థానం అనవసరమని అభిప్రాయపడుతున్నారు. పీఆర్ స్టంట్స్‌తోనే సంజూ కెరీర్ కొనసాగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.“చూసి నేర్చుకో బ్రో” అంటూ విమర్శలు వెల్లువెత్తుతుండగా.. సంజూ కెరీర్ డేంజర్‌లో ఉందన్న చర్చ మొదలైంది.ఈ ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లతో మొత్తం 46 పరుగులే చేసిన సంజూ శాంసన్, టీ20 ప్రపంచకప్ 2026లో బెంచ్‌కే పరిమితం కానున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 12వ ఆటగాడిగా వాటర్ బాటిళ్లు మోసే పరిస్థితి రావచ్చని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.ఇదే సమయంలో తిలక్ వర్మ ఫిట్‌నెస్ సాధించి ప్రాక్టీస్ ప్రారంభించాడు. టీ20 ప్రపంచకప్ నాటికి అతను జట్టుతో కలవనున్నాడు. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా, తిలక్ నెంబర్ 3లో ఆడనున్నాడు. సంజూ మాత్రం బ్యాకప్ ప్లేయర్‌గా పరిమితం కావాల్సి వస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.ఎంతో ప్రతిభ కలిగిన సంజూ శాంసన్, నిలకడలేని ప్రదర్శనతోనే స్టార్‌డమ్‌ను పూర్తిగా అందుకోలేకపోయాడన్న విమర్శలు ఉన్నాయి. గత 12–13 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నప్పటికీ, తుది జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.
Latest News