|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:09 PM
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ గాయంతో ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. గత కొంతకాలంగా అతన్ని వేధిస్తున్న వెన్నెముక గాయం పూర్తిగా నయం కాలేదు. దాంతో వరల్డ్ కప్‌లో పాట్ కమిన్స్ పాల్గొనడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో కమిన్స్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. ఇదే సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సెలక్టర్లు బెన్ ద్వార్షుయిస్, మాథ్యూ రెన్‌షాలను జట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కమిన్స్, షార్ట్ స్థానాల్లో ఆడనున్నారు.
సెలక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుతూ “కమిన్స్‌కు ఇంకా విశ్రాంతి అవసరం ఉంది. బెన్ ద్వార్షుయిస్ మంచి రీప్లేస్‌మెంట్. అతను లెఫ్ట్ ఆర్మ్ పేస్‌తో పాటు అద్భుతమైన ఫీల్డింగ్, చివర్లో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం ఉన్న ప్లేయర్” అని తెలిపారు. అలాగే మాథ్యూ రెన్‌షాపై కూడా ఆయన నమ్మకం ఉంచాడు. “రెన్‌షా ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్‌కు అతను బలంగా నిలుస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో జట్టుకు లాభం చేకూరుస్తుంది” అని చెప్పారు.
శ్రీలంకలో జరిగే గ్రూప్ మ్యాచ్‌ల్లో స్పిన్ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉండటంలో బ్యాటింగ్ బ్యాలెన్స్‌పై కూడా సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలిపారు. టిమ్ డేవిడ్ కూడా గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం మరో ప్లస్ పాయింట్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా గ్రూప్ బీలో ఆడనుంది. ఈ గ్రూప్‌లో ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఒమన్ జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఫిబ్రవరి 11న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా తాజా స్క్వాడ్ ఇదే
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కాన్‌లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా.
Latest News