|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 10:22 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని మర్రిపూడి పోలీసు స్టేషన్ లో స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఒంగోలు పార్లమెంటరీ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి చేరెడ్డి నరసారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ సమన్వయకర్త రేగుల వీరనారాయణ, సీనియర్ నేత రమేష్ చౌదరి తదితరులు కలిసి కొండపి నియోజకవర్గం, మర్రిపూడి మండలంలో SI రమేష్ బాబుకు ఫిర్యాదు అందజేశారు.
Latest News