పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్‌
 

by Suryaa Desk | Sun, Feb 01, 2026, 10:29 AM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు, కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ దిశానిర్దేశం చేయనుంది.పార్లమెంట్‌లో బడ్జెట్‌ చదవడానికి ముందు ఆమె నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఈ ఆనవాయితీకి కారణాలేమిటి? సూట్‌కేస్ స్థానంలో వచ్చిన ‘డిజిటల్ బహీ-ఖాతా’ కథేంటి? వంటి వివరాలు మీకోసం..బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలవడం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. దీని వెనుక రాజ్యాంగ, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి.


రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 112): భారత రాజ్యాంగం ప్రకారం, బడ్జెట్‌ను (వార్షిక ఆర్థిక నివేదిక) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బాధ్యత నిజానికి రాష్ట్రపతిదే. రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఈ బాధ్యతను నిర్వహిస్తారు. అందుకే బడ్జెట్ ప్రసంగం చదవడానికి ముందు రాష్ట్రపతి నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.


బడ్జెట్ అనేది ఒక ‘మనీ బిల్లు’. రాజ్యాంగం ప్రకారం ఏదైనా మనీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం.సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ‘పెరుగు-చక్కెర’ తినిపిస్తారు. ఒక ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇది దేశీయంగా ఒక శుభసూచకంగా భావిస్తారు.రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు చేరుకుని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి (Cabinet) సమావేశంలో బడ్జెట్‌కు తుది ఆమోదం పొందుతారు.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM