|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 10:42 AM
తమిళనాడుకు చెందిన బీటెక్ విద్యార్థిని ఎం.రీత (19) తిరుపతిలో ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి తూర్పు పీఎస్ సీఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. కాంచీపురం తాలూకా కిల్కాద్రిపూర్ గ్రామానికి చెందిన ఎం.రీత(19) సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రోజూ బస్సులో వెళ్లి వచ్చే విద్యార్థిని రెండు రోజులుగా మనస్తాపంతో ఉండటాన్ని గుర్తించిన తల్లి ఆరా తీసింది. మానసిక బాధలు, చనిపోయేలా కలలు వస్తుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పింది. వాటి గురించి పట్టించుకోవద్దని కళాశాలకు పంపడంతో విద్యార్థిని గత నెల 30వ తేదీ తిరుపతికి వచ్చింది. దర్శనానికి వచ్చానంటూ హోటల్‌లో గదిని తీసుకుంది. సాయంత్రమైనా గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీల నుంచి పరిశీలించారు. ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి వేలాడటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించి అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Latest News