|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:03 PM
వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ..పుణె-హైదరాబాద్, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై, ముంబై – పుణె, బెంగళూరు – చెన్నై, ఢిల్లీ – వారణాసి, వారణాసి – సిలిగురి కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.ఆర్థిక సుస్థిరత కోసం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చాంపియన్ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తున్నామని తెలిపారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. దేశీ సెమీ కండక్టర్ రంగం వృద్ది కోసం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
Latest News