|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:07 PM
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ గూండాలు చేసిన దాడి రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.అయన మాట్లాడుతూ... మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు, కార్యకర్తలు దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆయన నివాసం ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, ఈ రాష్ట్రంలో మళ్లీ జంగిల్ రాజ్ నడుస్తోందని స్పష్టంగా చూపించారు. వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావం నుంచి అంబటి రాంబాబు పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కారణంతో ఆయన్ను హతమార్చాలని కుట్రలు చేస్తున్నారు. 1988లో ప్రతిపక్షంలో ఉన్న వంగవీటి మోహన్‌రంగా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హత్య చేశారు. 2016లో తునిలో ముద్రగడ పద్మనాభం టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టి వేధించారు. ఆయన భార్య, పిల్లలను బూతులు తిట్టి, ఆయన్ను చంపేందుకు ప్రయత్నించారు. ఇవాళ అదే తరహాలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని అంబటి రాంబాబును హత్య చేయాలని ప్రయత్నించారు అని మండిపడ్డారు.
Latest News