|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:09 PM
తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చేసిన కుట్రలకు ఆ భగవంతుడే సమాధానం చెప్పాడని, అవన్నీ పటాపంచలు అయినా, ఇంకా నిస్సిగ్గుగా అబద్దాలతో బుకాయిస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆక్షేపించారు. ఇకనైనా వారు వాస్తవాలు అంగీకరించకుండా, వైయస్సార్‌సీపీ నేతలపై దాడులు చేయడం అత్యంత హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇకనైనా చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకోవాలని, ముక్కు నేలకు రాసుకుని హిందువులకు, శ్రీ వెంకటేశ్వరస్వామి వారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
Latest News