|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:23 PM
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఖనిజాల వెలికితీతకు ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తీర ప్రాంత రాష్ట్రాలపై దృష్టి సారిస్తామని అన్నారు. సహజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థల స్థాపనకు నిర్ణయించినట్లు తెలిపారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో కొత్తగా మూడు రసాయన పార్కుల స్థాపన, ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
Latest News