|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 01:32 PM
కేంద్ర బడ్జెట్ 2026–27లో ప్రమాద బాధితులకు భారీ ఊరట లభించింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ (MACT) ద్వారా పరిహారం పొందే వారికి కీలక రాయితీ ప్రకటించారు. కోర్టులు కేటాయించే పరిహారంపై వచ్చే వడ్డీపై ఇకపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఈ వడ్డీపై అమలులో ఉన్న టీడీఎస్‌ను కూడా పూర్తిగా రద్దు చేశారు. దీంతో ప్రమాద బాధితులకు కేటాయించిన మొత్తం ఎలాంటి కోతలు లేకుండా నేరుగా అందనుంది.
Latest News