|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 01:34 PM
కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాన్సర్ రోగులకు ఉపశమనం ప్రకటించారు. ముఖ్యమైన 17 రకాల క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్ సుంకం మినహాయింపు ఇచ్చారు. దీంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. 7 అరుదైన వ్యాధులకు వాడే మందులకు కూడా సుంకాల మినహాయింపు లభించింది. ప్రత్యేక వైద్య ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగించే ఆహారపదార్థాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులు, డ్రగ్స్‌పై కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ఖర్చుల్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Latest News