|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:01 PM
భారతీయ సంప్రదాయంలో ఆభరణాలకు కేవలం అలంకార ప్రయోజనాలే కాకుండా, శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. బంగారం శక్తిని పెంచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని, వెండి శరీర వేడిని తగ్గించి చలవ చేస్తుందని, రాగి రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుందని పేర్కొంది. ముక్కుపుడక శ్వాసకోశ ఆరోగ్యాన్ని, కాలి మెట్టెలు నరాల పనితీరును మెరుగుపరుస్తాయని, ముఖ్యంగా మహిళల్లో రక్తపోటును నియంత్రిస్తాయంటున్నారు. వాతావరణాన్ని బట్టి లోహాల వాడకం మారుతుందని, ఉష్ణమండల దేశాల్లో వెండికి, చల్లని దేశాల్లో బంగారానికి ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.
Latest News