|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:23 PM
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‍పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌కు కేటాయింపులు జరిపినట్లు తెలిపారు.ఈ కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ నిర్మాణానికి రోడ్ మ్యాప్‌గా నిలుస్తుందని ఆకాంక్షించారు. త్వరలో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబించిందని అన్నారు. సంస్కరణలను బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు.
Latest News