|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:14 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడికి ఊరటనిచ్చేలా ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, దిగుమతి సుంకాలను సవరించడంతో పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్ మందులు, వైద్య పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విదేశీ ప్రయాణాలు, విద్య, సోలార్ గ్లాస్, ఈవీ బ్యాటరీల తయారీకి వాడే యంత్రాలు, బూట్ల తయారీకి వాడే పైభాగం, చేపలు, రొయ్యల మేత ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్య రంగానికి రూ.10,000 కోట్లు కేటాయించారు.
Latest News