|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 05:28 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక, సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని ఆయన ఆదివారం విమర్శించారు.ఈ మేరకు 'ఎక్స్' వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు.ఉద్యోగాలు లేని యువత, పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూలుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచివున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు వీటన్నింటినీ బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్, భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వ్యవహరిస్తోంది అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రాహుల్‌తో పాటు ఇతర విపక్ష నేతలు కూడా బడ్జెట్‌పై పెదవివిరిచారు. వృద్ధిని పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించడానికి ఇందులో సరైన సంస్కరణలు లేవని విమర్శించారు.
Latest News