|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 05:32 PM
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరో అడుగు ముందుకేసి, స్టాక్ మార్కెట్ పతనానికి బడ్జెట్టే కారణమని ఆరోపించారు.బీజేపీ బడ్జెట్ ఫలితం ఇదిగో షేర్ మార్కెట్ భారీగా కుప్పకూలింది. ఆదివారం మార్కెట్ తెరుస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు, అది ఇంకా ఎంత పడిపోతుందన్నదే అసలు ప్రశ్న అని మేము ముందే చెప్పాం అని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ కేవలం 5 శాతం మంది ప్రజల కోసమేనని, కమీషన్లు దక్కించుకోవడానికి, బీజేపీ సొంత వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే దీన్ని రూపొందించారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.ఇది బీజేపీ తరహా అవినీతికి కంటికి కనిపించని లెక్కల చిట్టా అని అఖిలేష్ అభివర్ణించారు.అనియంత్రితంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం సమయంలో పన్ను ఉపశమనం కల్పించకపోవడం 'పన్ను దోపిడీ' కిందకే వస్తుందని ఆయన విమర్శించారు. సంపన్నులకు వ్యాపారం, ప్రయాణాల కోసం పదుల రకాల మినహాయింపులు ఇచ్చి, నిరుద్యోగులకు మాత్రం 'ఆశల ఖాళీ పళ్లెం' చూపించారని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి ప్రజలు పూర్తిగా మోసపోయినట్లు భావిస్తున్నారని, పేదలు మరింతగా కుంగిపోతున్నారని అన్నారు. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు టెలిస్కోప్‌తో వెతికినా తమ కోసం ఇందులో ఏమీ కనిపించలేదని, ఇది తీవ్ర నిరాశాజనకమైన, దారుణమైన బడ్జెట్ అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.
Latest News