|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 10:32 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, YCP నేత అంబటి రాంబాబుకు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి న్యాయమూర్తి జి.స్రవంతి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం గుంటూరులోని గోరంట్ల వద్ద అంబటి రాంబాబు వాహనంలో వెళ్తూ పోలీసులతో పాటు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపింది. దీనిపై TDP శ్రేణులు అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి చేశాయి.ఈ కేసులో ఫిబ్రవరి 1 రాత్రి గుంటూరులోని వికాస్ నగర్‌లో అంబటి నివాసాన్ని ముట్టడించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫిబ్రవరి 2న గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టులో అంబటి రాంబాబును హాజరుపరిచారు. ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. మరో కేసులో స్టేషన్ బెయిల్ మంజూరైంది.ఈ ఘటనకు ముందు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఆయన ఇంటి, పార్టీ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారని సమాచారం. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Latest News