రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:11 AM

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని జొన్నకూటి లిఖిత (23) మృతిచెందారు. రాజమహేంద్రవరం సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కారును విశాఖపట్నానికి చెందిన వీరి స్నేహితుడు వి.కిశోర్‌ నడుపుతున్నారు. రాజమహేంద్రవరం దాటిన తర్వాత దివాన్‌చెరువు, రాజానగరం మధ్య కారు ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొని డివైడర్‌పైకి వెళ్లింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న లిఖితను కారు బానెట్‌ నొక్కేయడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. కారులోని మిగిలిన ముగ్గురూ తీవ్రంగా గాయపడగా వేర్వేరు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరో పదినిమిషాల్లో వసతిగృహానికి వెళ్లిపోతారనగా ఈ ఘోరం జరగడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. దీనిపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
This budget is not for common people: Oppn Mon, Feb 02, 2026, 12:51 PM
NIA raids multiple places in Kashmir in terror-related case Mon, Feb 02, 2026, 12:46 PM
Afghan police find arms in car, arrest two suspects Mon, Feb 02, 2026, 12:44 PM
On boycotting clash against India, ICC warns Pakistan over selective T20 WC participation Mon, Feb 02, 2026, 12:27 PM
Off-field fallout: Pakistan's ICC match decision puts Colombo tourism at risk Mon, Feb 02, 2026, 12:05 PM