|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:24 AM
ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.3గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. కొన్నిచోట్ల భవనాలకు పగుళ్లు రావడం మినహా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని మెహర్, బిద్ధన్ అఖండ్ ప్రాంతాలలోని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. భూకంపం రావడంతో ప్రజలు పెద్దఎత్తున బాహ్య ప్రదేశాలకు పరుగులు తీశారని తెలిపారు. అంతే కాకుండా ఖతార్‌లోనూ యూఏఈలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశాలు ప్రకటించాయి. అయితే దానివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని పేర్కొన్నాయి. అయితే భూకంప తీవ్రత ఎలా ఉందనే అంశం అధికారులు పరిశీలిస్తున్నారు.
Latest News