|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:41 AM
మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు. జోగి రమేష్‌ను పరామర్శించిన వైయస్ జగన్.. జోగి రమేష్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన.. ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. అవే మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహించి వేయక తప్పదన్నారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ జోగి రమేష్‌కు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.
Latest News