చంద్రబాబు తిరుమల లడ్డూ అంశంపై విషప్రచారం చేయడం అత్యంత దారుణం
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:42 AM

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి పై జరిగిన దాడి ఇందుకు స్పష్టమైన నిదర్శనమని ఆయన అన్నారు.సోమవారం జరిగిన ప్రెస్ మీట్‌లో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ అంశంపై విషప్రచారం చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. తిరుమల లడ్డూ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు పరమ పవిత్రమైన ప్రసాదమని, అందులో ఎలాంటి జంతువుల కొవ్వు కలిసే అవకాశం లేదన్న నమ్మకం కోట్లాది భక్తుల్లో ఉందని పేర్కొన్నారు.అదే విషయాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంటూ, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా లడ్డూ విషయంలో విషప్రచారం చేస్తూ పోస్టర్లు వేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.ఆ పోస్టర్లను తొలగించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రయత్నించగా, అక్కడికి వెళ్లిన సమయంలో మహిళలు కూడా బూతులు తిడుతూ ఆయనపై దాడి చేశారని తెలిపారు. అంతటితో ఆగకుండా అదే రోజు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి హత్యాయత్నానికి టీడీపీ మూకలు పాల్పడ్డాయని మండిపడ్డారు.పోలీసులు సమక్షంలోనే దాడులు జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత దురదృష్టకరమని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News
Theegala seals second straight Top-10 finish at Farmers Insurance Open Mon, Feb 02, 2026, 05:02 PM
IMF lowers Pakistan's GDP growth forecast to 3 per cent Mon, Feb 02, 2026, 05:01 PM
Karnataka government should deal with issue of illegal Bangladeshis in state with an iron hand: Ashoka Mon, Feb 02, 2026, 04:59 PM
Budget sustains reform momentum through people-centric approach: KPMG in India CEO Mon, Feb 02, 2026, 04:48 PM
CBI raids 35 global cybercrime hotspots in 9 states, arrests key operative Mon, Feb 02, 2026, 04:46 PM