ఫిబ్రవరి 4న iQOO 15 Ultra లాంచ్.. ఫీచర్లు ఇవే!
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:56 AM

iQOO 15 Ultra ఫిబ్రవరి 4న చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. iQOO ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో తొలిసారి ‘Ultra’ మోడల్‌ను ప్రవేశపెట్టడం విశేషం. ఈ ఫోన్‌లో 2K సామ్‌సంగ్ ఎవెరెస్ట్ OLED డిస్‌ప్లే, 144Hz LTPO ప్యానల్, గరిష్టంగా 8,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందుబాటులో ఉంటాయి. కొత్త డిస్‌ప్లే iQOO 13తో పోలిస్తే 44 శాతం తక్కువ పవర్ వినియోగిస్తుందని కంపెనీ వెల్లడించింది. Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, ప్రత్యేక గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి.యాక్టివ్ కూలింగ్: ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు మొబైల్ హిస్టరీలోనే అతిపెద్ద ‘యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్’ను ఇందులో ఇన్-బిల్ట్‌గా ఇస్తున్నట్లు సమాచారం.


గేమింగ్ ఫీచర్లు: 600Hz శాంప్లింగ్ రేట్ కలిగిన ప్రెజర్-సెన్సిటివ్ షోల్డర్ ట్రిగ్గర్స్ గేమింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి.


బ్యాటరీ మరియు కెమెరా


ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,400mAh భారీ బ్యాటరీ ఉంటుందని అంచనా. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విభాగంలో 50MP మెయిన్ సెన్సార్‌తో పాటు 3X పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందించనున్నారు.

Latest News
UK imposes new sanctions on Iranian officials Tue, Feb 03, 2026, 12:59 PM
CMs welcome trade deal with US, hail boost to Make in India, global market access Tue, Feb 03, 2026, 12:53 PM
Trump rolls out 'Project Vault' minerals reserve Tue, Feb 03, 2026, 12:37 PM
India-US trade deal: Which goods might get cheaper? Tue, Feb 03, 2026, 12:32 PM
Mayank Yadav returns to India A squad for warm up match ahead of T20 World Cup Tue, Feb 03, 2026, 12:29 PM