|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 12:11 PM
టీ20 వరల్డ్‌కప్ 2026లో గ్రూప్ దశలో భారత్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ తన ఎక్స్‌లో వెల్లడించింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఫిబ్రవరి 15న టీమిండియాతో మ్యాచ్ ఆడదని ఆదేశాలు జారీ చేసింది. కారణం మాత్రం చెప్పలేదు. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని, ఎలాంటి గందరగోళానికి తావులేదని, ఒక్క మ్యాచ్‌ను బహిష్కరించినా చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీసీ స్పష్టం చేసింది. పాకిస్థాన్ లెక్కచేయకపోతే భారీ జరిమానాలు, నిషేధాలు వంటి కఠిన చర్యలు ఉండే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Latest News