|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 12:46 PM
వీపు మీద గుల్లలు లేదా మొటిమల సమస్య చాలా మందికి ఉంటుంది. వ్యాయామం తర్వాత, చెమట పట్టిన వెంటనే దుస్తులు మార్చాలని, చర్మం గాలి ఆడే కాటన్ దుస్తులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. బిగుతుగా ఉండే సింథటిక్ దుస్తులు రాపిడితో మొటిమలను తీవ్రతరం చేస్తాయని తెలిపారు. చక్కెర, వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండి, తాజా పండ్లు, కూరగాయలు తినాలని, పుష్కలంగా నీరు తాగాలని సూచించారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలని, రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యమని తెలిపారు.టీట్రీ ఆయిల్ వివిధ రకాల చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ నూనెతో తరచూ వీపును మర్దన చేసుకోవడం మంచిది. అలాగే టీట్రీ ఆయిల్ వాడి తయారుచేసిన లోషన్లు, క్లెన్సర్లు, క్రీమ్స్ ఉపయోగించినా ఫలితం ఉంటుంది. సన్‌స్క్రీన్ వీపుకీ అవసరమే. ఎందుకంటే దుమ్ము, కాలుష్యం కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఫలితంగా అక్కడి చర్మ కణాలు శుభ్రపడి మొటిమల సమస్య వేధించదు. అయితే నూనె రహిత సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.
Latest News