రామలీల ప్రదర్శనలో అపశ్రుతి కేసు నమోదు
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:16 PM

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన రామలీల ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. రావణుడి వధ ఘట్టంలో రాముడి పాత్రధారి వేసిన బాణం గురితప్పి, రావణుడి పాత్ర పోషిస్తున్న వ్యక్తి కంటికి తగలడంతో తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై పోలీసులు రాముడి పాత్రధారితో పాటు కార్యక్రమ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళ్ళితే... షాగంజ్‌లో గతేడాది నవంబర్ 13న రామ్‌సనేహీ సింగ్ అనే వ్యక్తి రామలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సునీల్ కుమార్ రావణుడి పాత్ర పోషిస్తుండగా, నైతిక్ పాండే రాముడిగా నటించాడు. రామ-రావణ యుద్ధ ఘట్టం ప్రదర్శిస్తున్న సమయంలో నైతిక్ పాండే వేసిన బాణం.. రావణుడి కిరీటానికి బదులుగా సునీల్ కుమార్ కంటికి బలంగా తాకింది. దీంతో అతని కంటి నుంచి రక్తం వ‌చ్చి తీవ్రంగా గాయపడ్డాడు.అయితే, ప్రమాదం జరిగినప్పటికీ నిర్వాహకుడు గానీ, రాముడి పాత్రధారి గానీ తనకు వైద్య సహాయం అందించలేదని బాధితుడు సునీల్ కుమార్ ఆరోపించాడు. చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని పలుమార్లు కోరినా వారు నిరాకరించారని వాపోయాడు. మరుసటి రోజు సాయం కోసం వారిని సంప్రదించగా, కులం పేరుతో దూషించి, చంపేస్తామని బెదిరించారని ఈ ఏడాది జనవరి 23న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ ఘటనపై మొదట ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని బాధితుడు తెలిపాడు. చివరకు ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం, షాగంజ్ పోలీసులు నిర్వాహకుడు రామ్‌సనేహీ సింగ్, నటుడు నైతిక్ పాండేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Latest News
Andhra Pradesh CM welcomes zero excise duty on unbranded raw tobacco Wed, Feb 04, 2026, 01:24 PM
Arsenal reach Carabao Cup final after last-gasp Havertz goal Wed, Feb 04, 2026, 12:53 PM
US Senators accuse UBS of blocking Holocaust truth Wed, Feb 04, 2026, 12:48 PM
CM Mamata files fresh plea in SC to stop voter name deletions during SIR in Bengal Wed, Feb 04, 2026, 12:37 PM
TN records over one lakh new cancer cases in 2025; Chennai reports highest count Wed, Feb 04, 2026, 12:28 PM