కూటమి పాలనలో బీసీ నేతలని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు
 

by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:01 PM

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అరాచక పాలన సాగుతోందని, దీనిని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు గమనించి వెంటనే టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను ఖండిస్తూ సోమవారం అనంతపురం నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ… ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగిపోయాయని, బీసీ నేతలపై జరిగే దాడులను భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. దౌర్జన్యాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్య గొంతులు నొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Latest News
T20 WC: Netherlands vs Namibia head-to-head and recent form analysis Mon, Feb 09, 2026, 11:26 AM
Coimbatore students say Pariksha Pe Charcha with PM Modi was like interacting with family member Mon, Feb 09, 2026, 11:14 AM
99% chance that India-Pakistan match will take place: Sources Mon, Feb 09, 2026, 11:03 AM
‘Working tirelessly’: PM Modi praises Eknath Shinde's push for Maharashtra's progress in birthday message Mon, Feb 09, 2026, 10:56 AM
T20 WC: Debutants Italy ask Scotland to bat in Group C game Mon, Feb 09, 2026, 10:52 AM