ఆర్ఏసీ టికెట్లకు పూర్తి ఛార్జీ వసూలు సమర్థనీయం కాదు: పార్లమెంటరీ కమిటీ
 

by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:20 PM

రైలు ప్రయాణంలో ఆర్ఏసీ (RAC) కింద టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేయడం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఆర్ఏసీలోనే ఉండి, బోర్డింగ్ సమయంలో బెర్త్ లభించని ప్రయాణికులకు ఛార్జీలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆర్ఏసీ ప్రయాణికులు బెర్త్‌ను మరొకరితో పంచుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో, అలాంటి వారికి టికెట్ మొత్తంలో కొంత భాగాన్ని రీఫండ్ చేయాలని కమిటీ ఆదేశించింది.ప్రస్తుతం ఆర్‌ఏసీ కింద బెర్త్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికుల నుంచి పూర్తి మొత్తంలో టికెట్‌ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే కేటగిరి కింద ఉండే మరో ప్రయాణికుడితో బెర్త్‌ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు ప్యాసింజర్లు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు టికెట్‌లో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది.

Latest News
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
'Make in India' helps create lakhs of jobs, women biggest beneficiaries: Ashwini Vaishnaw Mon, Feb 23, 2026, 03:33 PM
Mon, Feb 23, 2026, 03:33 PM
Mobile ban in Karnataka schools under discussion, parents also exerting pressure: Deputy CM Shivakumar Mon, Feb 23, 2026, 03:32 PM
Congress targets MP BJP govt over Ladli Behna Yojana Mon, Feb 23, 2026, 03:31 PM