తెల్ల జుట్టును నల్లగా మార్చే ఇంటి చిట్కాలు!
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:01 PM

వయసుతో పాటు జుట్టు తెల్లబడటం సహజం. దీనికి పోషకాహార లోపం కూడా ఒక కారణం. అయితే, బ్లాక్ టీ, ఉసిరి, కరివేపాకు వంటి ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ టీ ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో జుట్టును కడగడం, ఉసిరి నూనెను తలకు రాయడం, కొబ్బరినూనెలో కరివేపాకును మరిగించి తలకు అప్లై చేయడం వంటి పద్ధతులు జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయని వివరించారు.
బ్లాక్ టీ: టీ ఆకులు మనం ఎక్కువగా టీ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఎర్రగా ఉన్న జుట్టును కూడా నల్లగా మారుస్తాయి. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని దానిలో బ్లాక్ టీ ఆకులు వేసి నల్లగా మారే వరకు మరిగించాలి. వీటితో జుట్టును కడిగితే జుట్టు నల్లగా మారుతుంది.
కరివేపాకు మన కళ్ళకు మంచిదని వైద్యులు కూడా చెప్పారు. ఇవి కళ్ళకు మాత్రమే కాకుండా జుట్టుకు కూడా చాలా మంచిది. ఎందుకంటే, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ ఉన్నాయి. ముందుగా కొబ్బరినూనెను తీసుకుని దానిలో కరివేపాకు ఆకులను బాగా మరిగించాలి. ఆ నూనె చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వలన జుట్టు నల్లగా మారుతుంది.

Latest News
Governor Acharya Devvrat inaugurates 'Prakritik Krishi Utpadan' exhibition Fri, Feb 27, 2026, 12:54 PM
Amid Taliban escalation, Pakistan drags India narrative to deflect from internal strains Fri, Feb 27, 2026, 12:47 PM
Karnataka orders vigilance on IVF centres after Maha illegal egg donation racket links Bengaluru Fri, Feb 27, 2026, 12:03 PM
North Korea's Kim uses party congress to consolidate his long-term grip on power: Seoul Fri, Feb 27, 2026, 11:58 AM
US Senators seek probe into Chinese surrogacy centres Fri, Feb 27, 2026, 11:56 AM