|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 10:35 AM
అమెరికాలో గత పది-ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ వీకెండ్ లో 3 డిగ్రీల ఫారెన్ హీట్ కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో, బలమైన చలిగాలుల కారణంగా మైనస్ 14 డిగ్రీల వరకు చలి అనిపిస్తోంది. న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో 4.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆర్కిటిక్ గాలులే దీనికి కారణమని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వాతావరణ పరిస్థితుల కారణంగా 17 మంది మరణించగా, అందులో 13 మంది చలి కారణంగానే ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.న్యూయార్క్ నగరంలో మైనస్ ఉష్ణోగ్రతల వల్ల బయట నివసించే ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. అలాగే టెక్సాస్, లూసియానాలో హైపోథెర్మియా వల్ల పలువురు మృతి చెందారు. మిస్సిసిపీలో సంభవించిన చారిత్రక ఐస్ స్టార్మ్ వల్ల భారీగా చెట్లు విరిగిపడటంతో పాటు రోడ్లు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. దీంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.ఇకపోతే మంచు భారం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపోయాయి. అనేక రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క టెన్నెస్సీలోనే 3లక్షల మంది కరెంట్ లేక అవస్థలు పడుతున్నారు. మిస్సిసిపీలో 1.5 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. ఇలా అనేక లక్షలాది మంది అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు.దేశంలోని 2000 మైళ్ల విస్తీర్ణంలో ఒక అడుగు కంటే ఎక్కువ ఎత్తులో దట్టమైన మంచు వ్యాపించించింది. రహదారులను మూసేసింది.అంతేకాదు రవాణా శాఖపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. 15కి పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తుఫాను ప్రభావంతో విమానయాన రంగం కుప్పకూలింది. ఇప్పటివరకు 19,000 విమానాలు రద్దు కాగా, వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు.
Latest News