|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 10:49 AM
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీని విజయంతో ఆరంభించిన టీమిండియా, అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో, టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భారత జట్టును తమ నివాసానికి ఆహ్వానించి, భార్య నటాషా, పిల్లలతో కలిసి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆటగాళ్లు, కోచ్‌లు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు గంభీర్ నివాసానికి విచ్చేశారు. కాగా టీమిండియాకు ఆటవిడుపు కలిగించేందుకు, జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా గంభీర్ డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగానూ ఇలాగే ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆటగాళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపేలా హెడ్‌కోచ్ ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Latest News