|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 11:34 AM
ఫిబ్రవరి 9 నాటికి బిట్‌కాయిన్ 70వేల డాలర్ల వద్ద స్థిరపడడంతో క్రిప్టో మార్కెట్‌లో ఆశలు పెరిగాయి. గత వారం 60వేల డాలర్ల దిగువకు పడిపోయిన ధర ప్రస్తుతం 68వేల–72వేల డాలర్ల మధ్య కదలాడుతోంది. నిపుణుల ప్రకారం 68వేల వద్ద సపోర్ట్, 74వేల–75వేల వద్ద రెసిస్టెన్స్ కీలకం. అమెరికా CPI, రిటైల్ డేటా మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. 60వేల–62వేల వద్ద దశలవారీ పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని ఆన్-చైన్ డేటా విశ్లేషిస్తే.. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్నవారు ధర పెరిగిన ప్రతిసారీ నష్టాలను తగ్గించుకోవడానికి అమ్మకాలకు దిగుతున్నారు. దీనివల్ల మార్కెట్ పైకి వెళ్లడం కష్టతరంగా మారుతోంది. ఇక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విషయానికొస్తే.. ఫిబ్రవరి 6న దాదాపు 330 మిలియన్ డాలర్ల నెట్ ఇన్ ఫ్లోలు నమోదయ్యాయి. కానీ ఇది కేవలం వ్యూహాత్మక కొనుగోళ్లే తప్ప.. పూర్తిస్థాయి విశ్వాసం కాదని స్పష్టమవుతోంది.
Latest News