భారత్-అమెరికా ఒప్పందంపై రష్యా అసహనం!
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 11:38 AM

దాదాపు ఏడాదికాలంగా చర్చల దశలో ఉన్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో మధ్యంతర అగ్రిమెంట్ కుదిరింది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. అయితే, ఈ ఒప్పందంపై భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ట్రంప్ భారత్‌పై పన్నులు తగ్గించగా, రష్యా చమురు కొనుగోలు ఆపేస్తామన్న వాదనలు వచ్చాయి. ఈ పరిణామం రష్యా-భారత సంబంధాల్లో మలుపు తీసుకురావచ్చని, మాస్కోను పాకిస్థాన్‌కు దగ్గర చేస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గత సంవత్సరం, భారత్‌ రష్యన్ చమురు దిగుమతులపై ట్రంప్ సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేశారు, ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇటీవలి కాలంలో భారత్‌ ఇప్పటికే రష్యన్ చమురు దిగుమతులను తగ్గించింది, కానీ పూర్తిగా నిలిపివేసినట్టు ఎటువంటి నిర్ధారణ లేదు. భారత్‌ ఇంధన విధానం దాని సొంత నిర్ణయమని బయట నుంచి ఒత్తిడితో మారేది కాదని రష్యా వాదిస్తోంది.

Latest News
PM Modi, HM Shah to lead BJP's high stakes Kerala push ahead of Assembly polls Fri, Mar 20, 2026, 12:44 PM
After Hazlewood & Cummins, Starc set to miss start of IPL; Edwards ruled out with injury Fri, Mar 20, 2026, 12:37 PM
Uttarakhand Cabinet expanded; five new ministers sworn in Fri, Mar 20, 2026, 12:22 PM
US kidney care gaps raise global concern Fri, Mar 20, 2026, 12:20 PM
South Korea: At least 50 injured in fire at Daejeon car parts plant Fri, Mar 20, 2026, 12:11 PM