|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 01:19 PM
సీబీఐ నియమించిన సిట్ నివేదికలో తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు ఆరోపణలు అబద్దాలని తేలినా ఇంకా దుష్ప్రచారం చేయడంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన విష ప్రచారం హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఆయన మండిపడ్డారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎక్కడా జంతుకొవ్వు ఉన్నట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసినా.. ఇంకా బుకాయించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సిట్ నివేదిక తర్వాత కూడా చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పకుండా.. మరింత సంస్కారహీనంగా లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనింగ్ కెమికల్స్ వాడారంటూ అత్యంత దుర్మార్గమైన ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి నేతలు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు.
Latest News