|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:24 PM
ఈ రోజుల్లో హెయిర్ కలరింగ్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే, రంగు ఎక్కువ కాలం ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సల్ఫేట్-ఫ్రీ షాంపూ వాడటం, తరచుగా తలస్నానాలు చేయకపోవడం, హెయిర్ మాస్క్ ఉపయోగించడం, సూర్యకిరణాల నుంచి రక్షించుకోవడం వంటి చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. వేడి నీటితో తలస్నానం చేయడం, హీటింగ్ పరికరాలు వాడటం తగ్గించాలి. హెయిర్ కలర్‌లో ఉండే రసాయనాల గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యం.వృద్ధాప్యంలో జుట్టు రంగు మారిపోవడం సహజమే. అటువంటి సమయంలో వెంట్రుకలు నల్లగా మార్చుకోవడం కష్టం. కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయితే మాత్రం వాటిని సహాజసిధ్దంగా చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, తగినంత నిద్ర వంటికి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉన్న ఉత్పత్తులు ఉపయోగించొచ్చు. తెలుపు రంగు జుట్టుని మార్చుకునేందుకు ఇంట్లోనే దొరికే వాటితో సింపుల్ చిట్కాలు పాటించి చూడండి. మీ జుట్టు నల్లగా నిగనిగలాడిపోతుంది.
Latest News