|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:31 PM
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటన భాగంగా యూరప్ లో పర్యటించేందుకు మాన్ విదేశాంగ శాఖ అనుమతి కోరగా తిరస్కరించింది. దీంతో ముఖ్యమంత్రి మాన్ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఇటీవల మాన్ విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన 'ఇన్వెస్టర్స్ సమ్మిట్' కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్ మరియు నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య, మరియు విదేశీ పంజాబీల సహకారం కోసమే ఈ పర్యటన ఖరారైంది. అయితే కేంద్రం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
Latest News