పాకిస్థాన్ నిర్ణయంపై స్పందించిన సౌరవ్ గంగూలీ
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:32 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ నెల‌ 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం తనను విస్మయానికి గురి చేసిందని ఆయన అన్నాడు.ఆదివారం విలేకరులతో మాట్లాడిన గంగూలీ.. "ప్రపంచకప్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు? ఎలాగూ వాళ్లు శ్రీలంకలోనే ఆడుతున్నారు. పాకిస్థాన్ ఇలా వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచకప్ లాంటి టోర్నీలో ప్రతీ పాయింట్ ఎంతో ముఖ్యం" అని స్పష్టం చేశాడు. తటస్థ వేదికపై మ్యాచ్ జరుగుతున్నప్పటికీ పాకిస్థాన్ ఆడకపోవడాన్ని దాదా తప్పుబట్టాడు.

Latest News
Threat to energy security part of present-day warfare: Rajnath Singh Sat, Mar 21, 2026, 03:56 PM
MP celebrates Eid-ul-Fitr with religious devotion, greetings Sat, Mar 21, 2026, 03:23 PM
Rupali Chakankar’s resignation not enough, says Maha Opposition Sat, Mar 21, 2026, 03:22 PM
IPL 2026: Wasim Jaffer names RCB playing XI ahead of opener, excludes Phil Salt Sat, Mar 21, 2026, 03:14 PM
Gold plummets 5.89 pc this week amid profit booking, dollar surge Sat, Mar 21, 2026, 02:42 PM