జిమ్మీ లాయ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన కోర్ట్
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:34 PM

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతుగా నిలిచిన మీడియా దిగ్గజం, 'యాపిల్ డైలీ' పత్రిక వ్యవస్థాపకుడు జిమ్మీ లాయ్‌కు స్థానిక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 78 ఏళ్ల జిమ్మీ లాయ్‌పై జాతీయ భద్రతా చట్టం కింద ఈ తీర్పు వెలువడింది. హాంకాంగ్‌లో ఈ చట్టం కింద విధించిన అత్యంత కఠినమైన శిక్ష ఇదే కావడం గమనార్హం.విదేశీ శక్తులతో కుమ్మక్కై చైనా, హాంకాంగ్‌లపై ఆంక్షలు విధించేలా కుట్ర పన్నారని, దేశద్రోహపూరిత కథనాలను ప్రచురించారని జిమ్మీ లాయ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2019 నాటి ప్రజాస్వామ్య అనుకూల నిరసనల తర్వాత ఈ కుట్రలకు జిమ్మీ లాయ్ "మాస్టర్‌మైండ్"‌గా వ్యవహరించారని కోర్టు పేర్కొంది.2020లో బీజింగ్ ప్రభుత్వం హాంకాంగ్‌లో వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టం కిందనే జిమ్మీ లాయ్‌ను అరెస్టు చేసి విచారించారు. మరో కేసులో గత రెండేళ్ల నుంచి ఆయన జైలు శిక్ష అనుభవిస్తుండడంతో, ఈ తాజా తీర్పుతో ఆయన మరో 18 ఏళ్లు జైల్లోనే గడపాల్సి ఉంటుందని జడ్జి పేర్కొన్నారు.

Latest News
Threat to energy security part of present-day warfare: Rajnath Singh Sat, Mar 21, 2026, 03:56 PM
MP celebrates Eid-ul-Fitr with religious devotion, greetings Sat, Mar 21, 2026, 03:23 PM
Rupali Chakankar’s resignation not enough, says Maha Opposition Sat, Mar 21, 2026, 03:22 PM
IPL 2026: Wasim Jaffer names RCB playing XI ahead of opener, excludes Phil Salt Sat, Mar 21, 2026, 03:14 PM
Gold plummets 5.89 pc this week amid profit booking, dollar surge Sat, Mar 21, 2026, 02:42 PM