ప్రియుడి కోరిక తీర్చడం కోసం కన్నతల్లి ప్రైవేట్ ఫోటోలు షేర్ చేసిన కూతురు
 

by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:58 PM

బెంగళూరులో ఒక దుర్భర సంఘటన కలకలం రేపింది. తన తల్లి మరియు మరో మహిళా బంధువుకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, వాటిని తన ప్రియుడికి పంపించింది. నగరంలోని మైసూర్ రోడ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కూతురు ఫోన్ లో తన ప్రైవేట్ ఫొటోలను, వాటిని మరో వ్యక్తికి పంపించినట్లు గుర్తించిన ఆ తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన 23 ఏళ్ల యువతి తన చదువుకు మరియు ఉద్యోగ ప్రయత్నాలకు అవసరమని కోరడంతో తండ్రి ఆమెకు ఒక స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు. ఈ ఫోన్ తో కూతురు తన తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రైవేట్ భాగాలను ఫోటోలు తీయడం, బంధువు స్నానం చేస్తున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీయడం వంటి పనులకు పాల్పడింది. వాటిని తన ప్రియుడికి పంపించింది.ఇటీవల కూతురు గదిలోకి వెళ్లిన తల్లికి ఆమె ఒక గుర్తుతెలియని వ్యక్తితో వీడియో కాల్‌ మాట్లాడుతుండడం గమనించింది. తనను చూడగానే కూతురు ఆ కాల్ ను కట్ చేయడంతో అనుమానించింది. ఆ తర్వాత కూతురు ఫోన్ ను చెక్ చేయడంతో అసలు నిజం బయటపడింది.ప్రియుడు వరుణ్ (అలియాస్ గిరిధర్) ఒత్తిడి మేరకే తాను ఈ పని చేశానని యువతి తెలిపింది. తన తల్లి, పెద్దమ్మకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు, వీడియోలను తీసి వాట్సాప్ లో వరుణ్ కు పంపినట్లు చెప్పింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిబ్రవరి 5న బాధితురాలు ఫిర్యాదు చేయగా.. సమాచార సాంకేతిక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలైన యువతితో పాటు ఆమె ప్రియుడి ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు. కాగా, తల్లి ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే ఆ యువతి ఇంటి నుండి పారిపోయి సదరు యువకుడిని వివాహం చేసుకున్నట్లు సమాచారం.


 

Latest News
Threat to energy security part of present-day warfare: Rajnath Singh Sat, Mar 21, 2026, 03:56 PM
MP celebrates Eid-ul-Fitr with religious devotion, greetings Sat, Mar 21, 2026, 03:23 PM
Rupali Chakankar’s resignation not enough, says Maha Opposition Sat, Mar 21, 2026, 03:22 PM
IPL 2026: Wasim Jaffer names RCB playing XI ahead of opener, excludes Phil Salt Sat, Mar 21, 2026, 03:14 PM
Gold plummets 5.89 pc this week amid profit booking, dollar surge Sat, Mar 21, 2026, 02:42 PM