|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:57 PM
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపిన నేపథ్యంలో, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్లు మరణించాయి. చిత్తూరులోనే 28వేల కోళ్లు చనిపోయాయి. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు, బర్డ్ ఫ్లూ పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్నమయ్య జిల్లా సదుం మండలంలో వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని. కోళ్ల పెంపకందారులు తప్పనిసరిగా బయోసెక్యూరిటీ చర్యలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కోళ్లలో అసాధారణ మరణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తలే కీలకమని తెలిపారు. ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ కొనసాగిస్తోందని చెప్పారు. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ సహకరిస్తే పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి వస్తుందని మంత్రి తెలిపారు.
Latest News